THE BIBLE EXPLAINS THE ORIGIN OF EVIL AND THE PRESENT CONSEQUENCES-TELUGU

దుష్టత్వం యొక్క ఆవిద్భావన గురించి మరియు వాటి యొక్క ప్రస్తుత పర్యావసానాలను బైబిలు వివరించింది

మంచి చెడు మరియు చీకటి వెలుగు ఎప్పుడు కలిసి ఉంటాయని లోకములో ఒక నానుడి ఉంది. కాని అది అబద్ధం. దానికి భిన్నంగా బైబిలు అలాటి ప్రకటనలు ఖండించింది. చెడు యొక్క ఉనికి కేవలం పాపముతో ప్రారంభమైనది.

దేవుడు కేవలం మంచిని యదార్థమైన వాటినే చేసేదని బైబిలు చాలా స్పష్టంగా చెప్పింది కాని సృష్టి ఆయన ధర్మశాస్త్రమును అతిక్రమించి ఆయనమీద తిరుగుబాటుకు పూనుకుంది.

ప్రసంగి 7: 29 “29. ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.”

సృష్టి అంతా చెడిపోలేదు కాని ఎవరి గర్వాహంకారాలు దేవునితో సమానమవ్వాలని మరియు దేవునిలా పూజింప బడాలని ఆకాశమునకు ఎగిసాయో అలాంటి వారితో ఈ చెడు ఆవిద్భవించింది.

యెషయా 14: 12-14 “12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? 13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును 14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?”

యేహెజ్కేలు 28: 13-18 “13. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. 14. అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి. 15. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. 16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను పవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. 17. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.  18. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.”

ఈ రోజున ప్రజలు వేదనతో మరియు మరణముతో బాధపడడం మనము చూస్తున్నాము. మరియు ఈ మానవాళి యొక్క బాధలకు కారణం దేవుని ముందు ఘనమైన ప్రసస్తమైన  దేవదూతగా ఎంచబడిన, గతంలో లూసిఫర్ గా పిలువబడిన ఆ తరువాత దేవుడు తన మారని ధర్మశాస్త్రము వలన కౄరుడని చెప్పుచూ దోషము జరిగించుచు మరియు పాపం చేస్తూ మూడవ వంతు దేవదూతలను పాపంలో పడవేసి  సాతానుగా(తిరుగుబాటుదారుడుగా) పిలువబడుతున్న విశ్వంలోని ఈ సృష్టే. మరియు ఈ సాతానే దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన విషపూరితమైన పండును ఆదాము హవ్వలు దేవుని అనుమతి లేకుండా దొంగిలించి తినేలాగా, మీరు ఆ పండు తింటే దేవుళ్ళ వలే ఉంటారని అబద్ధాలు చెప్పి మోసం చేసి పాపంలో పడవేశాడు.

కొంతమంది ఇది కేవలము కల్పిత కథయే అని చెప్పి అపహసిస్తారు కాని మీరు ప్రకృతిలో ఇది గమనించలేదా? ఎలాగ చాలా పండ్లు లేక ఆకులు మన శరీరమునకు విషపూరితం చేసి మన శరీర నిర్వహణను సరిగ్గా జరగకుండా ప్రభావం చూపి చివరకు మనకు అనారోగ్యమును మరియు మరణమును కలుగ చేస్తాయో గమనించలేదా? ఇదంతా శాస్త్రము. కాని చాలా మంది ఈ ప్రాథమిక శాస్త్రమును అర్థం చేసుకోలేరు ఎందుకంటే వారు దేవుని లేఖనములను ద్వేషముతో చూస్తున్నారు. వారి ద్వేషము వారియొక్క వివేకమునకు అంధత్వము కలుగ చేసింది. మరియు ఈ విషపూరితమైన పండు శరీరమును బలహీన పరచి మరణమును కలుగ చేసింది. ఇది విస్మయముతో మనము ఒప్పుకొన వలసిందే.

ఆదికాండము 2: 16-17 “16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

కాని చెడ్డ ద్రోహియైన సాతాను ఇలా చెప్తున్నాడు

ఆదికాండము 3: 4-5 “4. అందుకు సర్పము మీరు చావనే చావరు; 5. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా”

కాగా ఆయనే నిజమైన సృష్టికర్త దేవుడు కాబట్టి ఆయన ఆది దంపతులకు ఇచ్చిన హెచ్చరిక సత్యము.

1 యోహాను 3: 4“4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

రోమీయులకు 6: 23 “23. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్య జీవము.”

అవును. మనయొక్క వర్తమాన పర్యవసానాలు అన్నింటికీ కారణము పాపమే. మనము పాపమును చిన్న చూపు చూసి మన ఇష్టం వచ్చిన జీవితం కొనసాగిస్తూ ఉండొచ్చు కాని దాని అంతము ప్రమాదకరము. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం ఇలా పలుకుతుంది.

సామెతలు 14:12 “12. ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.”

దీనికి ముగింపు దేవుడు వినయులను మరియు సాత్వికులను కోరుకుంటున్నాడే కాని గర్విష్టులను తిరుగుబాటుదారులను కాదు.

యెషయా 57: 15-16 “15. మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. 16. నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. ”

చివరిగా మంచి చెడు కలిసి ఉండలేవు. చెడు అంతా కూడా పూర్తిగా నిర్మూలమవుతుంది. ఈ చెడు మరల జరగదు. ఆ సమయమందే వేదన మరియు మరణము వంటి బాధలు అన్ని సమాప్తమవుతాయి.

ప్రకటన గ్రంథము 21: 4 “4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”

యెషయా 65: 17“17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.

బైబిలులోని దేవుడు ప్రేమస్వరూపి. (1 యోహాను 4:8)

ఇలాగా చెడు లోకములోనికి ప్రవేశించి చీకటి యొక్క అన్ని విధములైన చెడ్డ కార్యముల ద్వారా లోకమునకు భ్రష్టత్వము కలుగ చేసింది. దేవుడు మంచివాడు కాబట్టి ఈ లోకంలోని గందరగోళ పరిస్తుతుల మధ్యలో కూడా ఈ చెడు నుండి తప్పించుకోవడానికి మార్గమును చూపించి ఎన్నటికి అంతములేని సంతోషకరమైన శాంతి యుతమైన పరలోకపు నిత్యజీవములోనికి ప్రవేశించుటకు ద్వారాలు తెరిచి ఉంచాడు.

దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుడిని గనుక హృదయపూర్వకముగా నమ్మినట్లితే, మీరు ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా రక్షింపబడడానికి  సాకుల గురించి కనీసం ఆలోచించను  కూడా ఆలోచించరు. మీ యొక్క నిర్ణయములకు మీరే బాధ్యులు. మేము కూడా మిమ్మల్ని మా హృదయ పూర్వకంగా వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాము. అలాగే దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో, వివేకముతో, వివేచనా శక్తితో మరియు శాంతి సామాధనములతో దీవించి మరియు తన యొక్క కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగము ద్వారా తాను చూపించిన అతి గొప్ప ప్రేమను  చూడగల కన్నులు, వినగల చెవులు, గ్రహించగల హృదయమును మీకు అనుగ్రహించాలని మనస్సారా ప్రార్థిస్తున్నాము!

మీకు సమాధానము కలుగును గాక!

 దేవుడు మిమ్మల్ని దీవించును గాక!