విగ్రహారాధన

“అవి వెండి బంగారువి

వాటికి కన్నులు ఉన్నా కాని కానలేవు

చెవులు ఉన్నా కాని వినలేవు

ముక్కులు ఉన్నా కాని వాసన చూడలేవు

నోళ్ళు ఉన్నా కాని పలుకలేవు

చేతులు ఉన్నా కాని పట్టుకోలేవు

పాదములు ఉన్నా కాని నడువలేవు ”

                                                            కీర్తనలు 115లో ప్రభువైన దేవుడు

ఇదే విగ్రహముల యొక్క పరిపూర్ణ నిర్వచనము. పైన చెప్పబడిన నిజాలు, అబద్ధములని నాకు నిరూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. భూకంపాలు, వరదలు, సునామీలు మరియు తుఫానులు, పెను తుఫానులు విగ్రహములను వాటి యొక్క ఆలయాలను పడగొట్టాయి. వాటికి కనులు ఉండి కూడా చూడలేవు, నోళ్ళు ఉన్నా కూడా మాట్లాడలేవు కాబట్టే ప్రకృతి విపత్తుల వలన నశించే వారిని కూడా హెచ్చరించలేవు, వారిని ఆదుకోలేక పోవడమే కాకుండా, వాటిని అవి రక్షించుకోవడానికి పాదాలు ఉండి కూడా పరుగెత్తలేవు. అవి ప్రకృతి విపత్తుల చేత విరగగొట్టబడినా కూడా  వాటికి చేతులు ఉండి కూడా కాపాడుకొనలేవు. అవి పాడైపోయి శిథిలమైపోతాయి.

ఈ రోజున దాదాపుగా ప్రపంచమంతా విగ్రహాలను ఆరాధించే విగ్రహారాధనలో మునిగిపోయింది.  ఆ విగ్రహాలకు మొక్కే వాళ్ళు విగ్రహారాధికులు అనబడతారు. దాదాపు ప్రపంచమంతా అనగా హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, జోరోస్ట్రియన్లు, ఆఫ్రికాకు మరియు అమెరికాకు చెందిన తెగలు, రోమన్ క్యాథలిక్లు, అన్య క్రైస్తవులు(సిలువ ముందు మొకాళ్ళూనేవారు) అందరు విగ్రహారాధికులే.

కాని బైబిలు యొక్క మహా గొప్ప దేవుడి ప్రకారము విగ్రహారాధన అనేది పాపము. బైబిలు యొక్క దేవుడికి విగ్రాహారాధన హేయమైనది. బైబిలులోని  జీవముగల దేవుడు విగ్రహారాధనను జీవములేని ఆరాధనగా అనగా నిర్జీవమైన మరియు మృతమైన ఆరాధనగా సంభోదించాడు.

సజీవుడైన దేవుడు విగ్రహముగా ఆరాధించబడడాన్ని ఎందుకు తిరస్కరించాడో అనేది దేవుని వాక్యమైన బైబిలు ప్రకారముగా మనము చూద్దాము.

నిర్గమాకాండము 20:4-6 “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించు వాడనై యున్నాను.”

ఇక్కడ భావము చాలా స్పష్టంగా ఉంది. మీరు ఏ విగ్రహమును చేసికొనకూడదు. మరియు వాటి ముందు మోకరించకూడదు, సాగిలపడకూడదు.  మరియు పాడైపోయే భౌతికమైన వాటితో ఆ విగ్రహములను పూజింపకూడదు. ఇదే విగ్రహారాధన. విశ్వమంతటికి నిజ దేవుడిని, ఆయనది కాని లేక ఆయన లాగా లేని మరియు ఆయన మహిమను చూపించలేని వేరే రూపంలో విగ్రహముగాచేసి పూజిస్తే ఆయనకు రోషము కలుగజేయడము అవుతుంది. ఆయన మనలను ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా తిరిగి అలాంటి ప్రేమను చూపించాలనే కోరుకుంటున్నాడే కాని, మన ద్వేషమును, మన శాపములను మరియు మన దేవదూషణలను కాదు.

బైబిలులోని సజీవుడైన దేవుడు మానవుడు విగ్రహారాధన చేయకూడదని  ఎందుకు నిషేదించాడు?

యెషయా 42:8 “యెహోవాను(అనగా ప్రభువైన దేవుడు) నేనే; ఇదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చు వాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.

సర్వజ్ఞానియైన సజీవుడైన దేవుడు ఆయన మహిమను ఉలుకు పలుకు లేని ఏమి తెలియని విగ్రహాలకు ఇవ్వను అని చెప్తున్నాడు. సజీవుడైన దేవుడు తనను నిర్జీవమైన విగ్రహములతో పోల్చడానికి ఇష్టపడనని చెప్తున్నాడు. ఆయన అన్నింటికి జీవమును ఇచ్చే సృష్టికర్త అయితే, మానవాళి నిర్జీవమైన విగ్రహాలను సృష్టికర్తలు అని చెప్పి మహిమ పరుస్తున్నారు. సత్యము అసత్యములను ఎలాగ అంగీకరిస్తుంది? సత్యములు అబద్ధాలతో కలుస్తుందా? అమితమైన దేవుడిని మితమైన మనస్సుగల మనిషి తనయొక్క మితమైన ఊహలకు పరిమితం చేస్తున్నాడు. కాని సజీవుడైన దేవుడు మనలను విశ్వమంతటికి శాసనాలుగా ఉన్న తనయొక్క పది ఆజ్ఞల ధర్మశాస్త్రమును పాటించాలని కోరుకుంటున్నాడు. ఇదే అమితమైన దేవుని పరిశుద్ధమైన  ధర్మశాస్త్రమునకు మరియు మితమైన మనస్సు గల మర్త్యమైన మనిషికి మధ్యన జరుగుతున్న మహా గొప్ప పోరాటము.

ఆదికాండము 6:5 “నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి”

యిర్మియా 17:9-10 “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.”

కీర్తనలు 58:3 “తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.”

గలతీయులకు వ్రాసిన పత్రిక 5:19-21 “శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.”

విగ్రహారాధన మీ పూర్వీకుల కుటుంబ ఆచారం అని చెప్తూ మీరు సమర్థించు కోవచ్చు. కాని వాస్తవ్యములను వదిలేసి తరాలనాటి పారంపర్యమైన విశ్వాస పద్ధతులను నమ్మడము అవివేకము. మీరు దేవుని శక్తిని వాస్తవికముగా రుచి చూచి తెలుసుకోవాలి. అదే బైబిలు దేవుడు చెప్తున్నాడు.

కీర్తనలు 34:8 “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.”

కాని చాలా మంది విగ్రహారాధన అనేది దేవుని ఆరాధనలో అఆఇఈలు లాంటిది అని అంటూ అందులో తప్పేమీ లేదని అనుకుంటూ ఉంటారు.

కాని బైబిలు వేరే విధముగా చెప్తుంది.

రోమీయులకు వ్రాసిన పత్రిక 1:20-25 “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్”

వారు సజీవుడైన దేవుడిని ఎరిగిన వారై యుండి కూడా ఆయనను మహిమ పరచక ఆయన మీద తిరగబడి ఇష్టపూర్వకముగా విగ్రహారాధకులు అయ్యారు అని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది. వారు సజీవుడైన నిజ దేవుడిని వదిలిపెట్టి స్త్రీ పురుషులు యొక్కయు, ఫీనిక్స్ పక్షిలాంటి పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువులైన ఏనుగులు, సింహముల యొక్కయు,  ఇంకా అనేకమైన వాటి యొక్కయు విగ్రహములను చేసికొని వాటిని పూజిస్తూ అవివేకులు  అయ్యారు.

వారు ఎంతగా అవివేకులు అయ్యారు అంటే సజీవుడైన దేవుని సత్యమును నిర్జీవమైన విగ్రహముల యొక్క అబద్ధముగా మార్చేశారు.

కాని చాలా మంది “ఇవి నిర్జీవమైన విగ్రహాలు కాదు. దేవుడు సర్వాంతర్యామి. ఆయన అన్నింటిలో ఉన్నాడు. మేము ఆ విగ్రహములలో దేవుడిని చూస్తాము” అని ప్రతిపాదిస్తుంటారు.

ఒక్కసారి ఈ తర్క విరుద్ధమైన వివరణలను లోతైన అంతర్ధ్రుష్టితో పరిశీలిద్దాము.

ఓ దేవుడు సృష్టించిన ప్రియ ప్రశస్తమైన ఆత్మా! దేవుడు అన్నింటిలో ఉoడినట్లైతే మీరు ఎందుకు మీ సాటి మనిషి యొక్క పాదాల మీద సాగిలపడి పూజించడంలేదు? పూలను, పూల దండలను, బంగారు కిరీటమును, బంగారు వస్త్రములను, బంగారు ఉంగరములను, బంగారు ఖడియములను,   బంగారు కంకణములను, బంగారు బాసికములను, బంగారు దండలను మరియు బంగారు పాద రక్షలను  తెచ్చి మీ తోటి మనిషిని అలంకరించి సాగిలపడి పూజించoడి. మీరు దేవుడిని నిర్జీవమైన విగ్రహాలలో చూస్తున్నారు కాని సాటి మనుష్యులలో దేవుడిని చూడలేకపోతున్నారా? మీ వ్యాఖ్యానము ప్రకారము “దేవుడు అన్నింట్లో ఉంటాడు” అనగా దేవుడు మీలోను, మీ సాటి మనుష్యులలోను  ఉన్నాడు. మరి మీరు ఎందుకు మిమ్మల్ని మీరు పూజించుకోరు? అలాగే మీరు కూడా దేవుడు అయితే మరి మీరు కొన్ని జీవాలను సృష్టించక పోయారా? మరణించిన వారికి జీవము ఇవ్వలేక పోయారా? మరియు మీ దైవ శక్తితో రోగులను బాగు చేయలేక పోయారా? అది చేయడానికి వైద్యులు(డాక్టర్లు) ఉన్నారు అని నాకు చెప్పవద్దు. అప్పుడు రోగులను బాగు చేసే వైద్య జ్ఞానసామర్థ్యతలు వైద్యులకు స్వతహాగా కలిగి ఉండినట్లైతే, వారు వైద్యo చేసే జ్ఞానము కొరకు వైద్య శాస్త్రపాఠశాలలకు ఎందుకు వెళ్తున్నారు? వారు అలాగ అభ్యాసాలు చేసినా కూడా ఇంకా రోగులను చికిత్స చేయడంలో ఎందుకు పరిపూర్ణులు అవలేకపోతున్నారు? అయినా కూడా ఇంకా ఎందుకు సైడ్ ఎఫ్ఫెక్ట్లు వచ్చే మందులు తయారు చేసే ఫార్మసిటికల్స్  మీద ఆధారపడుతున్నారు? వైద్యులు ఎందుకు రోగాలకు శాశ్వతమైన స్వస్థత చికిత్స చేయలేక పోతున్నారు? వారు జీవాన్ని ఇవ్వకపోగా ఎందుకు యుతనేషియా పేరుతో ఎందుకు రోగులను చంపుతున్నారు? వైద్యులే దేవుళ్ళు అయితే, వారు ఎందుకు గర్భస్రావము ద్వారా బిడ్డను చంపి జీవాన్ని తీసేస్తున్నారు?వారు ఎందుకు పిల్లల్ని చంపుతున్నారు? మరి కొన్ని సంధర్భాల్లో  గర్భ సమస్యల వలన మరియు ప్రసవ సమస్యల వలన తల్లి బిడ్డలు ఇద్దరు చనిపోవాల్సి వస్తుంది.

కేవలం మతి స్థిమితం లేని వారే వైద్యులను దేవుళ్ళుని అంటారు. వైద్యులు కూడా దేవుని వరాలను తలాoతులుగా పొందిన మీ లాంటి నా లాంటి మనుష్యులే. బైబిలు దేవుడు మంచివారికి మరియు చెడ్డవారికి అందరికి కూడా తలంతులను, వరాలను ఇస్తాడు. కొంతమంది ఇతరుల మేలు కోసం వినియోగిస్తారు. మరి కొంతమంది వారి సొంత నాశనమునకు దారి తీసేలాగ  వారి స్వార్ధానికి ఉపయోగించుకుంటారు.

మత్తయి 5:44-45 “నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.

మరి మీకు దేవుడిచ్చిన తలాంతులను ఇతరుల మేలు కొరకు ఉపయోగించి దేవుడిని మహిమ పరుస్తున్నారా?

మీరు చేసిన వ్యాఖ్యల ప్రకారము మీరు విగ్రహము ఉంటేనే అక్కడ దేవుడి ప్రత్యక్షత ఉందని అంటున్నారు. అక్కడ విగ్రహం లేకపోతే దేవుని ప్రత్యక్షత అక్కడ లేదు అనేది మీ భావమా? దేవుని యొక్క ప్రత్యక్షత అన్ని చోట్ల ఉంటుంది. మీరు నిజమైన దేవుడిని పూజించట్లేదు కాబట్టే దేవుని ప్రత్యక్షతను అన్ని చోట్ల మీరు అనుభవించలేక పోతున్నారు. కాబట్టే మీరు విగ్రహాలను చేసికొని ఇతరులు చూసేలాగా దానిలో దేవుడి ప్రత్యక్షత ఉందని, అది మీరు నమ్ముతున్నారని ప్రదర్శించుకుంటున్నారు, కాని మీరు ఆ చోటన మాత్రము దేవుని ప్రత్యక్షత లేదని నమ్ముతున్నట్లు పరోక్షంగా ఇతరులకు చూపిస్తున్నారు. అది అతి పెద్ద అబద్ధం. దేవుడు మీరు ఆ అబద్ధాలను నమ్మాలని కోరుకోవడము లేదు. నిజమైన క్రైస్తవులైన మేము విగ్రహము లేకపోయినా కూడా ఎక్కడున్నా దేవుని ప్రత్యక్షత అనుభవిస్తూ మా మోకాళ్ళ మీద నిలబడి పరిశుద్ధమైన చేతులు పైకెత్తి ఆరాధిస్తున్నప్పుడు, మరి మీరెందుకు అలాగ దేవుడి ప్రత్యక్షతను అనుభవించలేక పోతున్నారు? మీకు నిజ దేవుని స్వభావము తెలియదు కాబట్టే ఆయన ప్రత్యక్షతను అన్ని చోట్ల అనుభవించలేక పోతున్నారు. మీ పాపములు మిమ్మల్ని దేవుడి దగ్గర నుండి వేరు చేశాయి అని మీకు తెలియదు కాబట్టే మీరు అన్ని చోట్ల దేవుని ప్రత్యక్షతను అనుభవించలేక పోతున్నారు. అందుకే దేవుడు విగ్రహారాధనను ఖండించాడు. ఎందుకంటే మీరు మీ పాపాల వలన దేవుని ప్రత్యక్షత నుండి వేరు చేయబడ్డారు కాని అక్కడ విగ్రహము లేకపోవడము వలన కాదు అని దేవుడు మీకు తెలియపరచాలని అనుకుంటున్నాడు. కాబట్టే మీరు అబద్ధాలను నమ్మకూడదని విగ్రహారాధనను నిషేధించాడు. అక్కడ విగ్రహము లేకపోయినాకూడా దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఉంది.

యిర్మియా 10:14 “తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.”

మరి అలాగే మీరు దేవుడిని దోమలలో కూడా చూస్తారని నేను నమ్ముతున్నాను.

మరి దోమలు కూడా దేవుళ్ళు అయితే నా మొదటి ప్రశ్న ఏమిటంటే, అవి బ్రతకడం కొరకు మనుష్యుల రక్తమును ఎందుకు పీలుస్తున్నాయి? దోమ దేవుడు దానిని అది సంరక్షించుకోలేదా? దానికి దానిలో స్వతహాగా ప్రాణము కలిగి ఉండలేదా? దోమలు జీవాన్ని ఇవ్వలేక పోవడమే కాదు గాని దానికి బదులుగా మన శరీరములో మరణకరమైన రోగాలను కలుగ చేసే విషాన్ని వదులుతాయి. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు విగ్రహాలలో ఉండడని అలాగే దేవుడు అన్నింటిలో ఉండడని సర్వాంతర్యామి కాదని చాలా సులువుగా నిరూపించవచ్చు. కాని ఆయన ప్రత్యక్షత విశ్వమంతటా ప్రతి స్థలములో ఉంటుంది అని సులభంగా అర్థమౌతుంది.

 

దేవుని యొక్క నిజస్వరూపము

దేవుని యొక్క స్వభావమును తెలిసికొనుట చాలా ఆసక్తికరమైన మరియు ప్రాముఖ్యమైన అంశము. దేవుని యొక్క నిజస్వరూపము ఏంటి?

ఏ నరుడు కూడా దేవుడిని ఆయన మహిమలో ఎప్పుడూ చూడలేదని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది.

యోహాను 4:24 “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.”

మరి దేవుని యొక్క స్వరూపమును మనము ఎలా తెలుసుకోగలము? మనము ఒకవేళ వేరు వేరు ఆలయాలలో ఉన్న ఒకే దేవుడి విగ్రహాలను తీసికొని పోల్చి చూసినట్లయితే అవి అన్ని ఖచ్చితంగా ఒకేలాగా ఉంటాయని మనము చెప్పలేము. ఒక్క విగ్రహములో ముక్కు పొడవుగా ఉంటుంది. ఇంకొక విగ్రహములో కన్నులు చిన్నగా ఉంటాయి. ఎలా చూసినా కూడా ఏ విగ్రహము దేవుని యొక్క నిజమైన స్వరూపమో అనేది తేల్చి చెప్పలేము. ఇంకొన్ని సందర్భాల్లో ఆ దేవుళ్ళను వాటి యొక్క దుస్తులు చూసి లేక ఆయుధాలు చూసి గుర్తు పట్టాలి. ఇది ఎంత దయనీయమైన పరిస్థతి? నిజమైన దేవుడికి యుద్ధము చేయుటకు ఆయుధములు అవసరమా? కేవలం భూమ్మీద ఉన్న రాజులకు మాత్రమే యుద్ధము చేయడానికి ఆయుధాలు అవసరము.

కేవలం ఒక ఊహ అనేది దేవుని నిజ స్వరూపము అవ్వదు. దేవుడిని కనుగొనడము సంభావ్యత కాదు. అలాగే ఆయనను ఒక పెట్టెలో పెట్టి చీట్లు తీసినట్లు లేక లాటరి తీసినట్లు ఎంచుకొని పూజించడము కాదు. ఆ విగ్రహాలకు నోళ్ళు ఉన్నా కూడా అవి తామే దేవుళ్ళమని చెప్పుకొని సమర్ధించుకోలేవు.

దేవుడిని కనుగొనడం అనేది మీరు స్వచ్చమైన హృదయముతో పట్టు విడువకుండా  ఎంతగా వెతికారు అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. మరియు మీరు ఆయనను కనుగొనే వెతుకులాటలో ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి.

వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

సత్యము కోసము ప్రార్థించి వెతకడము మీ బాధ్యత. అప్పుడు మీరు నిజమైన దేవుడిని కనుగొంటారు. ఈ లోక జ్ఞానము కోసము మీరు పాటశాలలకు కళాశాలలకు వెళ్లి వాటి గురించి జ్ఞానాన్ని అభ్యసిస్తారు. మరి ఈ విశ్వమంతటిని నడిపిస్తున్న దేవుదడిని కనుగొనడానికి సత్యమందు మరియు ప్రకటనల యందు ఆయనను వెతుకుతున్నారా?

ఇది మీ పాపము కాదు. మీ పూర్వీకులు సత్యవంతుడైన దేవుడిని మరియు ఆయన ఆజ్ఞలను  తిరస్కరించి వారి శరీర ఆశలు నెరవేర్చు కొనడానికి చేసిన పాపము. కాని ఇప్పుడైతే నిజమైన సృష్టి కర్తను శ్రద్ధగా వెతికి కనుగోనడమో లేక మీ పాత విశ్వాస పద్ధతులను అనుసరించి మీ పూర్వీకుల పాపములో కొనసాగి  మీ తరువాత రాబోయే తరముల వారిని కూడా పాపులుగా చేయడమో అనేది మీరు తీసుకునే నిర్ణయముము మీదే ఆధార పడి ఉంటుంది. ఇదే మానవాళి పూర్ణ కర్తవ్యము. ఈ లోకం అపరిపూర్ణతలతో, ప్రకృతి విపత్తులతో, వేదనలతో, బాధలతో, రోగములతో, మరణములతో కూడిన గందర గోళంతో ఎందుకు నిండి ఉందో పరిశీలించాలి? మనము ఈ లోకమును ఏ దరిద్రుడు, బీదవాడు, అవసరతగల వాడు లేకుండా శాంతి సమాధానములతో ఉండటానికి ఒక పరిష్కారం కనుగొనాలి. అలా ఉండబోయేదే దేవుని పరలోక రాజ్యము. ఆ రాజ్యము గురించే బైబిలు సాక్ష్యమిస్తుంది. అందుకే మేము ఎక్కడైతే ఏ నొప్పి, వేదన, బాధ మరియు మరణము అనేవి ఉండవో ఆ దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తున్నాము.

ఒక్కసారి విగ్రహారాధికులు పూజించే విగ్రహములు ఎలా చేయబడతాయో చూద్దాము.

యెషయా 44:10,12-13 “ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు? కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలి కొనగా అతని బలము క్షీణించి పోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్కచేయును. కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును. మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.”

బైబిలును వ్రాసిన రోషము గల సజీవుడైన దేవుడు విగ్రహముల ఉత్పత్తిని అలా వర్ణిస్తున్నాడు. మీరు సుత్తెతో మీ దేవుడిని కొట్టి కొట్టి కొట్టి ఒక నరుని సౌందర్యరూపములో చేస్తారు. అలాగ ఒక రాయిని కొడుతూ కొడుతూ ఒక ఆకారములోకి చేసి దానిని దేవుడు అని పిలుస్తుంటే మీకు మనస్సులో ఏమి అనిపించట్లేదా? ఆ విగ్రమును చేసే కంసాలి ఎలాంటి వాడు అని విచారించలేదా? అతడు ఎప్పుడు కూడా దేవుడిని చూడలేదు. అయినా కూడా అతడు ఒక అత్యంత సౌందర్యమైన రూపమును చేస్తే ఆ విగ్రహముతో ప్రేమలో పడి దానిని కొంటారు, అది బాగోకపోతే దానిని తిరస్కరింస్తారు. ఒకవేళ అతడు దేవుడిని చూశాను అని చెప్పుకొనిన అతడు దేవుని ఖచ్చితమైన ప్రతిరూపమును చేసే ప్రసక్తే లేదు. ఈ పనివాడు రాయిని కాని కొయ్యని కాని కొట్టి కొట్టి కొట్టి ఆకలి గొంటాడు, దప్పిక గొంటాడు, అలసి పోతాడు  కాని ఆ విగ్రహము అతడి ఆకలి దప్పికలు తీర్చలేదు. ఇదే విగ్రహముల యొక్క అతి తీవ్రమైన దుస్థితి.

ఎంతో ఘనమైన మరియు సజీవుడైన దేవుడిని ఎందుకు పనికిరాని నిర్జీవమైన విగ్రహములతో పోల్చవచ్చా? అన్నింటికీ జీవాన్ని ఇచ్చే దేవుడిని ప్రకృతి విపత్తుల సమయములో  ప్రాణ హాని కలుగ చేసే రాళ్ళు రప్పలతో పోల్చడం దేవ దూషణ కాదా? అది దుస్సాహసం కాదా?

బైబిలులోని దేవుడు మహా శక్తిమంతుడు. మీరు ఆయనకీ ప్రార్థన చేయడానికి ఏ ఆలయానికి వెళ్ళాల్సిన అవసరము లేదు. మీరు విగ్రహములు చేసే ఆయనను ఆరాధించనవసరం లేదు. మీరు ఎడారిలోని చెరసాలలో ఉన్నాకూడా ఆయన ప్రత్యక్షతను అనుభవించాలంటే మీరు ఆయనను సరిగ్గా ఎరిగిన వారై ఉండాలి. అప్పుడు ఆయన నామముతో ఒక్కసారి పిలవండి, ఆయన ప్రత్యక్షతను మీరు తక్షణమే  చూస్తారు. అదే దేవుని యొక్క గొప్పతనము. ఆయన మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు.

కాని మీరు ఆ రాయిని కాని కొయ్యను కాని గట్టిగా కొట్టి కొట్టి కొట్టి, అదే దేవుడు అని పిలుస్తున్నారు? అలాగే దాని కొట్టే వాడు ఒక పాపిష్టి వాడు, వాడు ఎప్పుడూ దేవుడిని చూడలేదు కాని అతడి ఊహకు నచ్చిన ఒక రూపాన్ని ఎన్నుకొని ఒక విగ్రహముగా తయారు చేస్తాడు. అయినా దేవుడిని దూషిస్తేనే దేవ దూషణ అంటాము. మరి అలాంటిది దేవుడు అని చెప్పుకొంటున్న దానిని సుత్తులతో కొడితే ఇంక ఏమి అవుతుందో ఆలోచించoడి.

అది కేవలం ఒక గుడ్డివారినో లేక కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తిని ఈ దిక్కు నుండి దానికి అటుపక్క దిక్కున ఉన్న ఎవెరెష్టు పర్వత శిఖరము ఎక్కమనడమే. కాబట్టి అతడు ఆ శిఖరము ఎలా ఎక్కలేడో అలాగే ఒకడు దేవుడి రూపాన్ని కూడా చేయలేడు. మీరు ఎప్పుడైనా ఆ విగ్రహాలను మైక్రో స్కోప్ క్రింద పెట్టి చూశారా? ఒకసారి చూసినట్లైతే ఆ విగ్రహమంతా నొక్కులు నొక్కులతో ఎంత అసహ్యంగా ఉందో చూస్తారు. అదే దేవుడి సృష్టిని ఒక్క సారి చూసినట్లయితే గడ్డి పొరచ కూడా ఎంతో అందంగా అలంకరించ బడినట్లు కనిపిస్తుంది. దానంతటిలో దేవుని వేలి ముద్ర కనిపిస్తాయి. కాని ఆ దేవుని వెలి ముద్రలు మనుష్యులు చేసిన విగ్రహాలలో కనిపించవు.

అవి దేవుడు చేసిన విగ్రహములు కాదు. దేవుడు అక్కడ విగ్రహముగా అవతరించాడు అని మీరు నాతో వాదించవచ్చు. ఒక సారి దీని గురించి లోతుగా ఆలోచిద్దాము. అనేకమైన ఆలయాలలో ఉన్న ఒకే దేవుడి విగ్రహములు ఒకటే రకముగా ఉండవు. మరి వాటిలో ఏ విగ్రహము నిజమైనది? అస్సలు దేవుళ్ళు భూమ్మీదకి దిగి  వచ్చి విగ్రహాలుగా అవతరించారు అనడానికి ఋజూవు ఏంటి?

సరే ఒకవేళ అవతరించారే అనుకోండి. వారు ఆభరాణలతో అవతరించారా? లేక ఆభరణాలు లేకుండా అవతరించారా? ఒకవేళ ఆభరణాలు లేకుండా అవతరిస్తే, ఆ దేవుళ్ళ మీద ఉన్న ఆభరణాలు ఏమయ్యాయి? ఆ ఆభరణాలు అతడి మహిమను చూపించ వచ్చుగా? మరి ఆ మహిమ ఎక్కడ? మీరెందుకు భౌతికమైన ఆభారణాలతో వాటిని అలంకరిస్తున్నారు? వారు ఆయుధాలతో అవతరించారా లేక ఆయుధాలు లేకుండా అవతరించారా? ఆ దేవుళ్ళకు ప్రేమ ఉంటే ఆయుధాలు ఎందుకు? ఎవరి మీద యుద్ధం చేయడానికి? అస్సలు దేవుళ్ళు ఆయుధాలు లేకుండా ఏమి చేయలేరా? ఆ విగ్రహముల యొక్క ఎత్తు ఎంతా? దేవుడికి స్నానం అవసరమా? అంటే దేవుడు మురికి పడతాడా? ఆ విగ్రహములు వాటి జాగ్రత్త అవి ఎందుకు తీసుకోలేవు? వాటిలో జీవము ఎక్కడ ఉంది?

మీరు నమ్మేదంతా ఒక కల్పించబడిన అబద్ధం అయితే  ఏంటి? మీరు అది అబద్ధం కాదని ఎలా నిరూపిస్తారు? ఇప్పటి ప్రపంచంలో మీ యొక్క ఒక్క విగ్రహదేవుడు కూడా విగ్రహంగా అవతరించలేదు. మరి దేనిని ఆధారం చేసుకొని ఒక దేవుడు అవతరించి విగ్రహం అయ్యాడని నమ్మాలి?

అయితే నేను మీరు చెప్పినదంతా ఏ ఆధారం లేకుండా నమ్మాలి అని అంటారేమో? అదే విశ్వాసం అని అంటారేమో? మొదటిగా ఈ ప్రపంచములో అబద్ధమనేది లేకుండా సత్యముతో నిండి ఉంటే మీరు చెప్పినది సత్యము అని నమ్మేవాడిని. కాని ఈ ప్రపంచమంతా అబద్దాలతో అబద్ధికులతో నిండి ఉంది. ఇది మనస్సులో ఉంచుకొని, దేవుడు విగ్రహముగా అవతరిస్తాడు అనే ఆధారము కేవలం మన పూర్వీకులకు మాత్రమే అవసరమా? ఆ ఆధారము మనకెందుకు అవసరం లేదు? మీ ఊహల దేవుడు వేరు వేరు జనముతో రక రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? కేవలం మన పూర్వీకులకు మాత్రమే విగ్రహంగా అవతరించి ప్రత్యక్షమౌతాడు, కాని మనకి అలా విగ్రహంగా అవతరించడా? మీరు చెప్పేది సత్యమైతే ఇస్లాము ప్రవక్త అయిన మొహమ్మద్ చెప్పింది కూడా నిజమని నమ్మాలి, ఎందుకంటే అతడు మక్కాలోని నల్ల రాయి పరలోకం నుండి దిగివచ్చిందని కల గని అదే నిజమని చెప్పాడు. కాని అతడు విగ్రహారాదికులను చంపాడు మరియు చంపమని బోధించాడు. ఎంతటి వేషధారణ? ఇదంతా కూడా దేవుడి వలన సంభవిoచలేదని చాలా స్పష్టంగా నిరూపిస్తుoది.

నా చిన్నతనము నుండి నేను ఒక్క సారి కూడా ఒక్క దేవుడు కూడా అవతరించి విగ్రహమైనట్లు చూడలేదు. కాని చాలా మంది బాబాలు మాత్రం విగ్రహ దేవుళ్ళుగా మారడం చూశాను. విగ్రహ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదనడానికి ఇదే బలమైన ఆధారం, అలాగే వారు కేవలం మనుష్యులై ఉండి దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు అని చెప్పడానికి ఇదే ఋజూవు. ఇదే బైబిలులో వివరించ బడింది. ఇది మొట్ట మొదటి స్త్రీ గురించి చెప్పబడింది. తాను కూడా దేవత అవ్వాలనుకునే దురాశ చేత పాపము చేసి మనుష్యులoదరి మీదకి మరణము అనే శిక్షని తీసుకు వచ్చింది.

ఆదికాండము 3:4-6 “అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు-మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;”

ఆ స్త్రీ సాతాను చెప్పిన మాటలు విని ఆ చెట్టు ఫలములు ఆమెను సర్వజ్ఞానిగా చేసి దేవతగా మారుస్తాయని నమ్మి ఆ విషమును తినింది. తన డి ఎన్ ఏ ను నాశనం చేసుకుంది. కాబట్టే ఇప్పుడు మనము ఇలా మర్త్యమైన శరీరములతో జీవిస్తున్నాము.

మరల మీరు విగ్రహ దేవుని రూపము యొక్క సంభావ్యత గురించి మాట్లాడితే మరి దాని ప్రకారము, మీరు కాని లేక మీ పొరుగువారు కూడా దేవుని రూపంలో ఉండివుండొచ్చు కదా? మరి మీరు అతడిని ప్రశస్తమైన ఆభరణాలతో అలంకరించి పూజిoచవచ్చు కదా?

పై తర్కములు అన్నీ పరిశీలించిన తరువాత దేవుడు అన్నింటిలో లేడు అని చాలా స్పష్టంగా అర్థమౌతుంది. కాని అన్ని చోట్ల ఉంటాడు. ఆయన కేవలం ఒక్క విగ్రహానికే పరిమితి కాదు. అందుకే బైబిలు దేవుడు భూమ్యాకాశములు ఆయనను పట్టజాలవు అని చెప్తాడు. ఆయన భూమ్యాకాశములు అంత పెద్దగా అయి విశ్వమంతా ఉండేoత పెద్దగా వ్యాప్తి చెందగలడు. అలాగే మన చిన్ని హృదయములలో నివశించేoత చిన్నగా అవగలడు. ఆయన అంతటి సమర్థుడు శక్తిమంతుడు.

దేవుడు శూన్యములో నుండి అంతటిని సృష్టించాడు. అలాగే అంతటిని శూన్యముగా మార్చగలడు. అదే బైబిలు దేవుడి యొక్క గొప్ప శక్తి.

అలాగే బైబిలు యొక్క దేవుడు పేరు ఉన్నవాడును అనువాడును అయిన ప్రభువైన దేవుడు. ఆయనే సమస్త జీవ రాశులన్నింటికి మూలాధారమై ఉన్నాడు. కాని మనము ఆయనను ఒక నిర్జీవమైన విగ్రహముగా పోలుస్తూ భావిస్తున్నాము. ఇదే దేవదూషణ! నిర్జీవమైన విగ్రహమును మిమ్మల్ని సృష్టించిన స్రష్ట అని పిలవడం దేవ దూషణ!

కాని ఇప్పుడు మీరు నాతో “మీకు కేవలం ఒక్క దేవుడే ఉన్నారని ఎవరు చెప్పారు? మా లేఖనాల ప్రకారము మాకు కొన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నారు” అని వాదిoచారనుకోండి.

ఆ సందర్భంలో, ఇన్ని కోట్ల మంది దేవుళ్లలో ఎవరు మీ యొక్క నిజమైన స్రష్ట? ఒకవేళ మీకు సోదరుడు ఉంటే గనుక, మిమ్మల్ని సృష్టించింది ఎవరు? మీ సోదరుడిని సృష్టించింది ఎవరు? ఆ తరువాత ఇంకా చాలా ప్రశ్నలు మొదలు అవుతాయి. మీ దేవుళ్లలో ఏ దేవుడు గొప్ప వాడు? మిమ్మల్ని సృష్టించిన వాడా? లేక మీ సోదరుడిని సృష్టించిన వాడా? మీ దేవుళ్ళు ఏ ధర్మ శాస్త్రమును అనుసరిస్తున్నారు? వారు అనుసరిస్తున్న ధర్మ శాస్త్రము వాళ్ళే స్థాపించారా? అలా ఎవరి ఇష్టం వచ్చిన ధర్మ శాస్త్రం వారు పాటిస్తే, ఏది నిజమైన ధర్మశాస్త్రము? ఒక దేవుడు తనను విగ్రహముగా చేసి పూజించమంటాడు. మరి యొక్క దేవుడు తనను విగ్రహంగా చేసి పూజింప వద్దు అంటాడు. ఒక దేవుడు అబద్ధాలను అంగీకరిస్తాడు, ఇంకొక దేవుడు నరహత్యలను అంగీకరిస్తాడు, ఇంకొక దేవుడు వావి వరసలు లేకుండా సంబంధాలు పెట్టుకుంటాడు. ఇంకొక దేవుడు మోసాన్ని అంగీకరిస్తాడు, ఇంకొక దేవుడు దొంగతనాన్ని అంగీకరిస్తాడు. వారిలో ఎవరిని మీరు పూజిస్తారు?

ఉదాహరణకి మాంత్రికుల యొక్క దేవుడు నర బలులను కోరుకుంటాడు? మరి వారి దేవుడిని కూడా మీరు అంగీకరిస్తారా? మరి అలా అంగీకరించినట్లైతే మిమ్మల్ని మీరు బలి అర్పించుకోవడం కంటే శ్రేష్టమైన బలి  ఇంకొకటి ఉండదు.

ఒక దేవుడు తన భక్తుడికి వరాలు ఇస్తాడు. ఇంకొక దేవుడు అతడు తన భక్తుడు కానందుకు శపిస్తాడు. ఇదంతా కూడా ఒక పెద్ద గందర గోళం. చివరికి వారు ఏ ఆశలేక ప్రాణభీతితో చని పోవాల్సి వస్తుంది.

ఈ రోజున చాలా మంది మనుష్యులు ఈ దేవుడి అవతారమని లేక ఆ దేవుడి అవతారమని  చెప్పుకుంటూ దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు. కాని వారు తమ భక్తులను మోసం చేస్తూ అడ్డంగా పట్టుబడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో “కొన్ని కోట్ల మంది దేవుళ్ళు” అనే మీ ఆధారము లేని ప్రతిపాదనను ఎలా సమర్థిoచుకుంటారు? ఏ దేవుడు నిజం చెప్తున్నాడో ఏ దేవుడు అబద్ధం చెప్తున్నాడో ఎలా తెలుస్తుంది? దేవుడు మిమ్మల్ని ఇలా గంధర గోళములో ఉంచడానికి దేవుడు ఏమైనా చిందర వందరుడు అనుకున్నారా? లేక ఇది పూర్తిగా మీ యొక్క అజ్ఞానపు ఊహ మాత్రమేనా?

దేవుని యొక్క జీవ గ్రంథము అయిన బైబిలు ఇలా చెప్తుంది.

రోమీయులకు 3:4 “…ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.”

ప్రతి ఒక్కరు వారు నమ్మే దేవుడే నిజమైన దేవుడు అంటే, మరి అస్సలైన నిజం ఏది?

ఇవన్ని అంతమవని జవాబులు లేని ప్రశ్నలు.

వాస్తవానికి మాయ అనేది ఏమి లేదు. విగ్రహారాధన అనేది పారితోషికాలు, కానుకలు, అర్పణలతో నిండి ఉండే మహా పెద్ద వ్యాపార వ్యూహం. ఇదంతా కూడా డబ్బు సంపాదించుకోవడానికి విశాలమైన దారి. దేవుడు భౌతిక వాది లేక లోకాయతికుడు కాదు. దేవుడు ధనవంతులకు మరియు దరిద్రులకు అందరికి దేవుడు. మీ యొక్క విలువైన భౌతిక సమర్పణలు ఆయనకు అవసరం లేదు. ఎందుకనగా విశ్వము దానిలో ఉన్న సమస్తమును దేవుడివే. అంతే గాక దేవుడు తనని తాను అలంకరించుకోవాలంటే కరిగిపోయి తరిగిపోయే భౌతికమైన వాటితో కాకుండా కరగని తరగని దేదివ్యమైన మహిమతో అలంకరించుకొనగలడు. అందరికి అన్నింటిని అనుగ్రహించే వాడు దేవుడే. అలాంటి దేవుడు బలహీనమైన భౌతిక వస్తువుల మీద ఆశపడడు. దేవుడు అమోఘమైన సర్వజ్ఞుడు. ఆయన తనకు తాను ఏమైనా చేసుకోవాలంటే ఎంతో ప్రశస్తమైన మహిమకరమైన రీతిగా చేసుకుంటాడు. ఇవన్ని ఆలోచించలేరు కాబట్టే బైబిలు యొక్క దేవుడు విగ్రహారాదికులను విగ్రహాలతోనే పోల్చాడు. విగ్రాహారాదికులు చూసి గ్రహించలేరు కాబట్టి వారు ఆత్మీయంగా గుడ్డి వారు.

ఒక అంధ వ్యక్తి

మరి పుట్టుకతో గ్రుడ్డివారి సంగతి ఏంటి? వారు ఎప్పుడూ కూడా విగ్రహ రూపాలను చూడలేదు. మరి వారు దేవుడిని ఎలా గుర్తుపడతారు? ఇది చాలా సులభం. మీరు సాగిలపడి దేవుని ముందు హృదయములను పరచి ప్రభువైన దేవుడిని పిలిచి ప్రార్థన చేయండి. ఒక అంధ వ్యక్తికి ప్రార్థించడానికి దేవుడి రూపం అవసరం లేదు. అదే బైబిలు యొక్క దేవుడు చెప్పాడు.

మీరు గనుక దేవుడిని స్వచ్చమైన శ్రద్ధ కలిగిన హృదయముతో వెదకినట్లైతే మీరు ఆయనను కనుగొంటారు. మీరు ఆయనను చూస్తారు. మరియు ఆయన నిన్ను నడిపిస్తాడు.

ఎందుకనగా ప్రభువైన యేసు క్రీస్తు “అడుగుడి మీకియ్యబడును, వెధకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.”-మత్తయి 7:7-8 అని వాగ్ధానము చేశాడు.

“నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.”-యిర్మియా 33:3

ఒక చిన్న విజ్ఞాపన

సజీవమైన దేవుని యొక్క గ్రంథము బైబిలు ప్రకారము. మీరు విగ్రహాలలో దేవుడిని చూడనవసరం లేదు. ఆత్మీయ నేత్రములతో ఆయనను చూడొచ్చు. అలాగైతే భూమి మీద అంధులు ఉండకూడదు. మీరు మంత్రాలు ఉచ్చరించాల్సిన అవసరంలేదు. మనస్సులో దేవునితో సంభాషించ వచ్చు. అలాగైతే భూమి మీద మూగవారు ఉండకూడదు. మీ పాపాలకు పరిహారముగా మోకాళ్ళ మీద నడవనక్కరలేదు, ప్రదక్షిణాలు చేయనక్కరలేదు, ఆలయాల చుట్టూ దొర్ల నక్కరలేదు. అవి యేసు క్రీస్తును రక్షకుడిగా ఒప్పుకోవడం ద్వారా కడగబడతాయి. అలాగైతే అంగ వైకల్యం గలవారు ఈ భూమి మీద ఉండకూడదు. మారు మనస్సు లేకుండా ఎన్ని పరిహారాలు చేసిన అవి నిష్ప్రయోజనాలే. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆత్మతో ఎలా ఆరాదిoచాలో బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది.

ఈ పేజిలో ఉన్న సమాచారము కొంత వరకు మీ ఆధ్యాత్మిక కన్నులు తెరుస్తాయి అని అనుకుంటున్నాను. కాని దేవుని పుస్తకమైన బైబిలు మీ కన్నులను పూర్తిగా తెరుస్తుంది.

దేవుడు మిమ్మల్ని ఇది అర్థం చేసుకోవడానికి వివేచన గల హృదయముతో దీవించాలని ప్రార్థిస్తున్నాను.

దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుడిని గనుక హృదయపూర్వకముగా నమ్మినట్లితే, మీరు ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా రక్షింపబడడానికి  సాకుల గురించి కనీసం ఆలోచించను  కూడా ఆలోచించరు. మీ యొక్క నిర్ణయములకు మీరే బాధ్యులు. మేము కూడా మిమ్మల్ని మా హృదయ పూర్వకంగా వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాము. అలాగే దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో, వివేకముతో, వివేచనా శక్తితో మరియు శాంతి సామాధనములతో దీవించి మరియు తన యొక్క కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగము ద్వారా తాను చూపించిన అతి గొప్ప ప్రేమను  చూడగల కన్నులు, వినగల చెవులు, గ్రహించగల హృదయమును మీకు అనుగ్రహించాలని మనస్సారా ప్రార్థిస్తున్నాము!

మీకు సమాధానము కలుగును గాక!

 దేవుడు మిమ్మల్ని దీవించును గాక!