THE BIBLE CONTAINS THE HOPE FOR SALVATION-TELUGU

బైబిలు నిత్య జీవమునకు

నిరీక్షణ కలిగి ఉంది

మనము ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు బైబిలు దేవుడు మనకు పరిహారం లేకుండా విడిచిపెట్టక పోవడం అనేది ఆశ్చర్యకరమైనది మరియు ఎంతో అమోఘమైనది. మనలను కీడు నుండి మరియు మరణము నుండి రక్షించడానికి దేవుడు మన పాపమునకు పరిహారం సిద్ధపరిచాడు.

యోహాను 3: 16 “16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”

మరియు ఈ ప్రభువైన యేసు క్రీస్తే దేవుని కుమారుడు. ఆయన దేవుని వంటి వాడు అనగా ఎలాగైతే తండ్రి తన యందు జీవమును అలాగే కుమారుడు కూడా తన యందు జీవము గలవాడు కాబట్టి దేవుని అద్వితీయ కుమారునిగా పిలువబడ్డాడు. కాబట్టే ప్రభువైన యేసు క్రీస్తు మన పాపముల కొరకు మరణించినప్పటికి ఆయన తన స్వంత జీవముతో తిరిగి లేచాడు. ఈ పునరుత్దానముతో ప్రభువైన యేసు క్రీస్తు తనను మరణము పట్టలేదని అలాగే తనను విశ్వసించిన వారు తన నామమును మరియు ఆయన తమ రక్షకుడని వారి నోళ్ళతో ఒప్పుకునిన వారికందరికీ నిత్య జీవమును ఇవ్వ గల శక్తి గల వాడని నిరూపించాడు.

యోహాను 5: 26 “26. తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.”

యోహాను 10: 17 “17. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.”

రోమీయులకు 5: “8. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తుమనకొరకు చనిపోయెను. 9. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. 10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. 11. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.”

1 పేతురు 1: 18-19 “18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని 19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా”

రోమీయులకు 6: 4-5 “4. కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు. 5. మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.

యోహాను 11: 25 “25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

1 యోహాను 3: 2-3 “2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. 3. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.”

1 పేతురు 1:13 “13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.”

తీతు 3: 7 “7. నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.”

తీతు 2: 11-14“11. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై 12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, 13. అనగా మహా దేవుడును మన రక్షకుడునైన ఏసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 14. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

ఈ సమస్త కీడును అంతము చేయుటకు ప్రభువైన యేసు క్రీస్తు రాకడ కొరకు ఈ దీవింబడిన నిరీక్షణతో వేచి చూస్తున్నాము.

దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుడిని గనుక హృదయపూర్వకముగా నమ్మినట్లితే, మీరు ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా రక్షింపబడడానికి  సాకుల గురించి కనీసం ఆలోచించను  కూడా ఆలోచించరు. మీ యొక్క నిర్ణయములకు మీరే బాధ్యులు. మేము కూడా మిమ్మల్ని మా హృదయ పూర్వకంగా వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాము. అలాగే దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో, వివేకముతో, వివేచనా శక్తితో మరియు శాంతి సామాధనములతో దీవించి మరియు తన యొక్క కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగము ద్వారా తాను చూపించిన అతి గొప్ప ప్రేమను  చూడగల కన్నులు, వినగల చెవులు, గ్రహించగల హృదయమును మీకు అనుగ్రహించాలని మనస్సారా ప్రార్థిస్తున్నాము!

మీకు సమాధానము కలుగును గాక!

 దేవుడు మిమ్మల్ని దీవించును గాక!