THE BIBLE GOVERNS EVERY INDIVIDUAL LIFE OF THE MANKIND-TELUGU

బైబిలు ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత జీవితమును నిర్దేశిస్తుంది

ఈ విశ్వంలో ఉన్న జీవ రాసులు అన్నియు ఒకరి కొకరు ప్రేమతో కలిసి జీవించడాన్ని అభ్యసించి పాటించడానికి బైబిలులో ఉన్న దేవుని యొక్క ధర్మశాస్త్రమే విశ్వము యొక్క ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రమంతయు కేవలం రెండు ఆజ్ఞలలో వివరించబడింది.

పది ఆజ్ఞల ధర్మశాస్త్రములోని మొదటి నాలుగు ఆజ్ఞలు మొదటి గొప్ప ఆజ్ఞలో సంక్షిప్తం చేయబడ్డాయి.

నిర్గమాకాండము 20:

“3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

  1. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. 5. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు 6. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించు వాడనై యున్నాను.

7.నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు.

8.విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. 9. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను 10. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు. 11. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.”

దేవుని యొక్క పది ఆజ్ఞల ధర్మశాస్త్రములోని మిగతా ఆరు ఆజ్ఞలు రెండవ గొప్ప ఆజ్ణలో ఉన్నాయి.

నిర్గమాకాండము 20:

“12. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

13.నరహత్య చేయకూడదు.

14.వ్యభిచరింపకూడదు.

15.దొంగిలకూడదు.

16.నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

17.నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.”

దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ వివరముగా నేర్చుకుంటే ఇంకా లోతైన భావములు వాటిలో ఉంటాయి. ఉదాహరణకు 7వ ఆజ్ఞ అయిన వ్యభిచారింపకూడదు అనే ఆజ్ఞను పరిశీలిస్తే వివాహము ముందే కాని వివాహమైన తర్వాతే కాని బైబిలు ప్రకారం వివాహంలో మీ భార్యతో లేక మీ భర్తతో తప్ప ఇంకా ఎవ్వరితో ఎటువంటి లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. బైబిలు దేవుని ప్రకారం వివాహం అంటే కేవలం ఒక పురుషుని మరియు ఒక స్త్రీని ఏక శరీరముగా చేసేదని అర్థం. కేవలం ఒక్క స్త్రీ మరియు ఒక్క పురుషుని మధ్య వివాహం మాత్రమే అంగీకారం. అంతే కాని బహు భార్యాత్వం, లేక బహు భర్తాత్వం, స్వలింగ సంపర్క వివాహం, జారత్వం, మరియు లింగమార్పిడి అనేవి పాపములు మరియు వక్రమైనవి.

అలాగే సురక్షితమైన మరియు స్వేచ్చా స్వాతంత్రములు గల జీవితం కోసం, పై చెప్పబడిన పది ఆజ్ఞలు పూర్తిగా అమలులో ఉండాలి లేకపోతే మానవాళి ఉనికికే ప్రమాదకరం. ఉదాహరణకు ఒక్కసారి 6వ ఆజ్ఞను గమనించినట్లైతే నరహత్య చేయవద్దు అని చెప్పబడింది. ఈ ఆజ్ఞను లోతుగా బైబిలులో చదివితే, నీ సోదరుడిని కాని నీ పోరుగువారిని కాని ద్వేషించిన కూడా పాపమే అని చెప్పబడింది. ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటె ఈ లోకంలో ఎవరు జీవిస్తారు?  కాబట్టి ప్రమాధములేని సంతోషకరమైన సురక్షితమైన జీవితం కావాలంటే ఈ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యం.

పైన చర్చింఛిన వాటితో పాటు ఎవరిని దొంగిలకూడదు అనే ఆజ్ఞతో పాటు మిగతా అన్ని ఆజ్ఞలను అతిక్రమిస్తే అది అస్తవ్యస్తమైన అదుపులేని దుస్త్త ప్రపంచానికి దారి తీస్తుంది.

కాబట్టే సృష్టి కర్త అయిన దేవుడు మనలను సృష్టించి మన పాటికి మనలను వదిలి పడెయ్య లేదు. మనకి సంతోశాకరమిన్ క్షేమకరమైన జీవితమును ఇవ్వడానికి పది ఆజ్ఞల చట్టమును లేక ధర్మశాస్త్రమును ఇచ్చాడు.

అయితే బైబిలు దేవుడు ఎందుకు వేరే ఏ దేవుడు మీకు ఉండకూడదు అని ఎందుకు ఆజ్ఞాపించాడు?

వేరే ఎవరైనా దేవుడు అని చెప్పుకుంటూ వచ్చి నరహత్య చేయవచ్చని, దొంగిల వచ్చని, వ్యభిచరించవచ్చని చెప్తూ అలా జరిగిస్తూ ఉంటె అది అక్రమమైన గందరగోళ ప్రపంచానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ ప్రపంచంలోని అనేకమైన ఆచారాలు మరియు సాంప్రదాయాలు గంధరగోళంగా ఉన్నాయి. ఈ పిల్ల దేవుళ్ళకి దేవుని ధర్మశాస్త్రము మార్చడానికి గాని లేక అతిక్రమించడానికి కాని ఏ అధికారము ఇవ్వబడలేదు.

దేవుని యొక్క ఉనికే ధర్మశాస్త్రాదారము మరియు ఈ ధర్మశాస్త్రము దేవునిలోనే ఉన్నది.  అలాగే ప్రతి వ్యక్తి దేవుని ముందుకు తీసుకు రాబడతాడు, అలాగే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చబడతారు.

ప్రసంగి 12:13-14 “13. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. 14. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.

పైన కట్టడలు అని తప్పుగా తర్జుమా చేయబడింది. అది ఆజ్ఞలు అని తర్జుమా చేయబడాలి.

ప్రసంగి 12: 1-2 “ 1. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.

దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుడిని గనుక హృదయపూర్వకముగా నమ్మినట్లితే, మీరు ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా రక్షింపబడడానికి  సాకుల గురించి కనీసం ఆలోచించను  కూడా ఆలోచించరు. మీ యొక్క నిర్ణయములకు మీరే బాధ్యులు. మేము కూడా మిమ్మల్ని మా హృదయ పూర్వకంగా వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాము. అలాగే దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో, వివేకముతో, వివేచనా శక్తితో మరియు శాంతి సామాధనములతో దీవించి మరియు తన యొక్క కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగము ద్వారా తాను చూపించిన అతి గొప్ప ప్రేమను  చూడగల కన్నులు, వినగల చెవులు, గ్రహించగల హృదయమును మీకు అనుగ్రహించాలని మనస్సారా ప్రార్థిస్తున్నాము!

మీకు సమాధానము కలుగును గాక!

 దేవుడు మిమ్మల్ని దీవించును గాక!