బైబిలు మాత్రమే
క్రైస్తవత్వానికి మూలాధారమైన పరిశుద్ధ బైబిలు(పరిశుద్ధ గ్రంథము) జీవన విధానమును పరివర్తింపగల అత్యద్భుతమైన శక్తి గలది. బైబిలు వర్తమాన, భూత భావిష్యత్కాలములలో ఉన్న విషయములను విశద పరచుచున్నది. చీకటిని బహిర్గతము చేసే వెలుగే బైబిలు, అబద్ధములు ఖండించే సత్యమే బైబిలు, అన్యాయమును అవినీతిని నిర్మూలించే నీతి న్యాయమైనదే బైబిలు. దేవుని చిత్తమును నెరవేర్చే దేవుని స్వరమే బైబిలు. ఎప్పటికి తరగని అత్యానందకరమైన మరియు సంతోషకరమైన జీవితమునకు నడిపించే సర్వశ్రేష్టమైన అధికారి బైబిలు అని క్రైస్తవులు నమ్ముతారు. బైబిలు చెప్పుటకు అనేకమైన సంగతులు కలిగి ఉంది ఎందుకనగా బైబిలు సంజ్ఞల రూపములో ఉన్న ఒక చారిత్రాత్మక గ్రంథము మరియు భవిష్యత్తును ప్రకటించే ప్రవచనాత్మక గ్రంథము. బైబిలులో ఉన్న సంజ్ఞ రూపకమైన మరియు ఉపమాన రూపకమైన భాష ప్రకటించబడిన తర్కమైన సంగతులను మరియు సంఘటనలను క్రమముగా చేసి వాటిని గ్రహించి మర్మములను అర్థం చేసుకొనే సవాలును దేవుడు ఆత్మలకు ఇచ్చారు. ఈ సంజ్ఞ రూపకమైన భాషలు భక్తిగల దప్పికగల ఆత్మలను బుద్ధిలేని జాగ్రత్హలేని ఆత్మలనుండి వేరు చేస్తుంది. బైబిలు తగ్గింపు సాత్వికము మరియు విధేయత గల వారి స్వభావములను వివరించడమే కాకుండా వారిని గర్వాహన్కారాలు మరియు అవిధేయత గల వారి ఆత్మల నుండి వేరు చేస్తుంది. బైబిలు గురించి చెప్పడానికి ఇంకా అంతములేని చాలా గొప్ప సంగతులు ఉన్నాయి కాని ఇంకా ఎంత చెప్పిన కూడా మాటలు చాలవు.
బైబిలులో కలిగి ఉన్నవాటిలో ఒక్కటైనా సృష్టిని మనము చూద్దాము
ఒక్కసారి సృష్టిని చూడండి మరియు దానిలో ఉన్న దేవుని చేతి పనిని చూడండి. ఈ సృష్టే దేవుని యొక్క సృష్టి గురించి బైబిలు చెప్పబడినట్లు తేటగా మాట్లాడుతుంది.
కీర్తనలు 19: 1-6 “1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. 2. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. 3. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. 5. అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. 6. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.”
3వ వచనము చూసినట్లయితే తర్జమాదారుల పొరపాటు మనము చూస్తాము. “వాటి స్వరము వినబడని భాషలేదు మాటలులేవు” అని తర్జుమా చేయబడాలి. పూర్వోత్తర సందర్భము చూసినట్లయితే అది మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.
యోబు 12: 7-10 “7. అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును.ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. 8. భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును 9. వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు? 10. జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.”
యెషయా 45: 18 “18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.”
యెషయా 45: 11-12 “11. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? 12. భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.”
యెషయా 46: 26,28 “26. మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు. 28. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.”
యెషయా 43:7 “7. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.”
జకర్యా 12:1 “1. దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా”
యిర్మియా 27:5 “5. అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.”
యిర్మియా 5:22 “22. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.”
మరియు సృష్టి గురించి అనగా సృష్టి యొక్క క్రమము వంటి అనేకమైన విషయాలను తెలుసుకొనుటకు ఆదికాండము మొదటి అధ్యాయము మీరు చదవగలరు. అలాగే దేవుని యొక్క శక్తిగల కార్యముల కొరకు మరియు ఆయన యొక్క చేతి అద్భుతముల కొరకు బైబిలు చదవండి.
అలాగే దేవుని సృష్టి యొక్క లోతైన మరియు వివరణాత్మక మైన వ్యాఖ్యానము కొరకు క్రింది లింక్ ని సందర్శించండి
కాని దేవుడు తనను కనుగొనడానికి ఏ ఆనవాలు లేకుండా మనలను వదిలి పెట్టలేదు. బైబిలు దేవుడు సృష్టి కర్త అని నిరూపించడానికి ఏదైనా గుర్తు కాని సంజ్ఞ కాని ఇవ్వబడిందా? అవును ఉంది. చాలా ప్రబలమైన ఆధారమే ఉంది. ఒక్క సారి 7 రోజుల వార చక్రమును గమనించండి. దేవునికి తప్ప ఈ వార చక్రము ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. మరియు అనేక మంది ఈ వార చక్రములను మార్చడానికి ప్రయత్నించారు కాని అది వారి ఓటమికే దారి తీసింది.
నిర్గమాకాండము 20: 8-11 “8. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. 9. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను 9. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను 10. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు. 11. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.”
ఆదికాండము 2: 1-3 “1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. 2. దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను. 3. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.”
కేవలము బైబిలు మాత్రమే వార చక్రముల ఉనికిని నిరూపించ గలదు. విశ్వమునకు సృష్టి కర్తయైన దేవుడు ఈ ఏడవ విశ్రాంతి దినములో తన ముద్రను మరియు గుర్తును ఉంచాడు.
అలాగే ప్రతి అధికారిక ముద్రలో లేక సంతకములో ఈ మూడు విభిన్నమైన లక్షణాలు ఉంటేనే ఆ ముద్ర లేక సంతకము చెల్లుతుంది.
- అధికారి యొక్క పేరు
- అధికారి యొక్క పదవి
- అధికారి యొక్క ప్రదేశము లేక భూభాగము
మరియు ఈ ముద్ర సృష్టి కర్త యొక్క పది ఆజ్ఞల ధర్మశాస్త్రములో ఉంది.
నిర్గామాకాండము 20: “11. 11. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి”
- ఆయన పేరు = యెహోవా (“ యెహోవాను నేనే; ఇదే నా నామము…” యెషయా 42:8)
- ఆయన పదవి = సృష్టికర్త (పై వచనములో “యెహోవా …. సృజించి” గమనించండి )
- ఆయన ప్రదేశము = ఆకాశమును భూమియు (పై వచనములో “ఆకాశమును భూమియు”ను గమనించండి)
ఆయన సంతకము పూర్తిగా ఇలా చదవ బడుతుంది
“భూమియు ఆకాశమునకు, సృష్టికర్తైన, యెహోవా”
ఈ విధముగా బైబిలు ప్రకృతి మీద ఎవరు మార్చలేని వేలి ముద్రలను కలిగి ఉంది. అలాగే ప్రకృతి తన మర్మములను బైబిలులో తేటగా కలిగి ఉంది. మీరు పక్షపాతము లేని అధ్యయనము గనుక అధ్యయనము చేసినట్లైతే మీరు సత్యమును చూస్తారు మరియు మీరు మార్గమును కనుగొంటారు చివరికి నిత్య జీవమును పొందటానికి మార్గాన్ని చూపించే బైబిలు దగ్గరకు వస్తారు.
కాని మీరు బైబిలులోని దేవుని ప్రశ్నించాలి అనుకుంటే మీరు మొదటిగా భూమ్యాకాశాములకు దేవుడు మీకు వేసిన ప్రశ్నలకు మీరు సమాధానము కనుక్కోవలసి ఉంటుంది.
యోబు 38: “1. అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను2. జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
3.పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
5.నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
6.దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము.దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
7.ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
8.సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
9.నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?
10.దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
11.నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
12.అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును
13.అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
14.ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కనబడును.
15.దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
16.సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
17.మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
18.భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
19.వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
20.దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
21.నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
22.నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
23.ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
24.వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
25.నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
26.పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
27.ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
28.వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
29.మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
30.జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
31.కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగసీర్షకు కట్లను విప్పగలవా?
32.వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
33.ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
34.జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
35.మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
36.అంతరింద్రియములలో2 జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు3 తెలివి నిచ్చినవాడెవడు?
37.జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
38.ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు?
39.ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
40.సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
41.తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?”
యోబు 39: “1. అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
2.అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
3.అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
4.వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
5.అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?
6.నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.
7.పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
8.పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
9.గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
10.పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
11.దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
12.అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?
13.నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
14.లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.
15.దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.
16.తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
17.దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.
18.అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
19.గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
20.మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.
21.మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.
22.అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.
23.అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగల లాడించబడునప్పుడు
24.ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.
25.బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.
26.డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?
27.పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
28.అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.
29.అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.
30.దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.”
దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుడిని గనుక హృదయపూర్వకముగా నమ్మినట్లితే, మీరు ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా రక్షింపబడడానికి సాకుల గురించి కనీసం ఆలోచించను కూడా ఆలోచించరు. మేము కూడా మిమ్మల్ని మా హృదయ పూర్వకంగా వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాము. అలాగే దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో, వివేకముతో, వివేచనా శక్తితో మరియు శాంతి సామాధనములతో దీవించి మరియు తన యొక్క కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగము ద్వారా తాను చూపించిన అతి గొప్ప ప్రేమను చూడగల కన్నులు, వినగల చెవులు, గ్రహించగల హృదయమును మీకు అనుగ్రహించాలని మనస్సారా ప్రార్థిస్తున్నాము!
మీకు సమాధానము కలుగును గాక!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!